
గ్రామీణ యువతీ యువకులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తుంది.గ్రామీణ ఉపాధి హామీ పధకం నిధులతో ఇప్పటికే ప్రతీ ఆవాసం లోనూ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది.ఆటలకు అనువైన క్రీడా ప్రాంగణాలు కు ఎస్.ఎ.టి.ఎ (స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్) ఆద్వర్యంలో క్రీడా సామాగ్రిని అందుబాటులోకి తెచ్చింది.ఇందుకోసం ఒక్క క్రీడా ప్రాంగణానికి క్రికెట్ కిట్లు 2,వాలీ బాల్ కిట్లు 2,డంబెల్స్ 3,డిస్క్ త్రో,టెన్నికాయిట్ రింగ్,స్కిప్పింగ్ రోప్ తో పాటు 75 స్పోర్ట్స్ టి.షర్ట్ లు తో కూడిన సామాగ్రిని సరఫరా చేస్తుంది.వీటిని డి.ఎస్.ఎ(డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అధారిటీ) ద్వారా మండల కేంద్రాలకు సరఫరా చేస్తుంది.ఈ క్రమంలో అశ్వారావుపేట మండలం క్రీడా ప్రాంగణాలు కు అవసరం అయిన క్రీడా సామాగ్రి బుధవారం మండల పరిషత్ కార్యాలయానికి చేరింది.ఈ సామాగ్రి ని ఎం.పి.డి.ఒ శ్రీనివాస రావు, ఎం.జి.ఎన్.ఆర్..ఈ.జి.ఎస్ ఎ.పి.ఒ నరేష్ లు ఆ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎం.పి.డి.ఒ శ్రీనివాస్ మాట్లాడుతూ డి.ఎస్.ఎ ఆదేశాలు మేరకు సామాగ్రిని సంబంధి కార్యదర్శులకు అందజేస్తామని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 22 మండలాలకు గాను 681 క్రీడా ప్రాంగణాలు కు ఈ క్రీడా సామాగ్రి సరఫరా చేస్తున్నారు.