
మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలకు క్రిభ్కో ఎరువుల సంస్థ తరపున క్రీడ పరికరాలను అందజేశారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో క్రిభ్కో ఎరువుల సంస్థ జిల్లా సేల్స్ ఆఫీసర్ లక్ష్మి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సంస్థ రూరల్ స్పోర్ట్స్ పోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు క్రీడా పరికరాలను అందజేశారు. పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం నాలుగు వాలీబాల్స్, టెన్ని కాలైట్స్, స్కిప్పింగ్ రోప్స్, చెస్ బోర్డ్స్, లెగ్ కాప్స్, నెట్ తోపాటు డస్ట్ బిన్లను పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా క్రిభ్కో ఎరువుల సంస్థ జిల్లా సేల్స్ ఆఫీసర్ లక్ష్మి నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు సంస్థ తరఫున కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే పలు పాఠశాలలకు క్రీడా పరికరాలను అందిస్తున్నామన్నారు. విద్యార్థులు కూడా క్రీడల్లో రాణించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. పాఠశాలకు క్రీడ పరికరాలను అందించిన క్రిభ్కో ఎరువుల సంస్థ యాజమాన్యానికి పాఠశాల తరఫున ప్రజలు ఉపాధ్యాయులు కే. రాజన్న కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సోమ దశరథ్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.రాజన్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, సహకార సంఘం కార్యదర్శి శంకర్, ఉపాధ్యాయులు సిరిమల్ల దేవన్న, మాసం శ్రీనివాస్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.