నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద జయంతుల సందర్భంగా ఏబీవీపీ భువనగిరి శాఖ ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు నిర్వహించారు. శనివారం పట్టణంలోని స్థానిక భువనగిరి జాగృతి కాలేజీలో ఇంటర్ విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ న్యాయవాది సామ రాజేందర్ రెడ్డి హాజరై, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా ముందుండాలని వారు అన్నారు, విద్యార్థులందరూ కూడా డ్రగ్స్ , బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండాలని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎబివిపి ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ సుర్వి మణికంఠ, యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ జూపల్లి దీపిక, నగర కార్యదర్శి గద్ద నితిన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరవింద్, హర్షవర్ధన్, అభి, మని, సాయి లు పాల్గొన్నారు.