మానసికోల్లాసానికిి క్రీడలు దోహదపడుతాయి

– తైక్వాండో కొరియన్‌ బ్లాక్‌ బెల్ట్‌ సర్టిఫికెట్‌, మెమెంటోలను అందజేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ మురళి కృష్ణగౌడ్‌
నవతెలంగాణ-తాండూరు
క్రీడలు మానసికోల్లాసానికిి దోహదపడు తాయని జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మురళి కృష్ణగౌడ్‌ అన్నారు. తైక్వాండో కొరియన్‌ బ్లాక్‌ బెల్ట్‌సర్టిఫికెట్‌, మెమెం టోలని తాండూర్‌కు చెందిన క్రీడాకారుడు మధు సూదన్‌ గౌడ్‌ ఆదివారం వికారాబాద్‌ జిల్లా గ్రంథా లయ మాజీ చైర్మన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మురళి కష్ణగౌడ్‌, మాస్టర్‌ మనోహర్‌ చేతుల మీ దుగా అందజేశారు. ఈ సందర్భంగా మురళీకష్ణ గౌడ్‌ మాట్లాడుతూ.. మాస్టర్‌ మనోహర్‌ 35 సం వత్సరాల పాటుగా క్రీడాకారులకి తైక్వాండో క్రీడను నేర్పిస్తూ.. వారి అభ్యున్నతికి కషి చేయడం చాలా అభినందనీయమని అన్నారు. అదేవిధంగా కీడా కారులకు ఉపాదితో పాటు వివిధ రంగాలలో ఉద్యో గ, అభివృద్ధికి ఈ క్రీడ దోహదపడుతుందని పేర్కొ న్నారు. ప్రతినిత్యం తైక్వాండో సాధన చేయడం వలన మన ఆరోగ్యం చురుకుగా ఉండడంతో పాటు భవిష్యత్‌లో చదువులో కూడా ముందుం డేందుకు దోహద పడుతుందన్నారు. అదేవిదంగా రానున్న రోజుల్లో క్రీడాకారులు అనేక రంగాలలో రాణించేలా కషి చేస్తారని ఆకాంక్షించారు.మన తాండూర్‌ నుంచి ఎంతో మందిని తయారు చేసి.. వారి అభ్యున్నతికి కషి చేసిన మాస్టర్‌ మనోహర్‌ ని ప్రత్యేకంగా అభినందించారు.