క్రీడలు మానసికల్లాసానికి తోడ్పడుతాయి..

– కీర్తిశేషులు జడ్పీ చైర్మన్ జగదీష్ జ్ఞాపకార్థం ఐదు వేలు ప్రథమ బహుమతి బహుకరిస్తా
– ములుగు జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి
– పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన జడ్పీ చైర్మన్
నవతెలంగాణ- తాడ్వాయి
క్రీడలు మానసికల్లాసానికి ఉపయోగపడతాయని ములుగు జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో స్థానిక ఎస్ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించి మాట్లాడారు. వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు ప్రధమ బహుమతి 5వేల రూపాయలను ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కీర్తిశేషులు ములుగు జిల్లా చైర్మన్ కుసుమ జగదీష్ జ్ఞాపకార్థం పర్సనల్ గా అందచేస్తానని పేర్కొన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, ఆరోగ్యం ఉంటారని అన్నారు. గెలుపు ఓటములు సహజమని, గెలిచినా ఓడిన క్రీడలు నిరంతర ప్రక్రియ అని నిరంతరం క్రీడల్లో కృషిచేసి అత్యున్నత స్థానాన్ని అధిరోహించాలని క్రీడాకారులకు సూచించారు. ఎంపీపీ గొంది వాణిశ్రీ మాట్లాడుతూ క్రీడల వలన భిన్నత్వంలో ఏకత్వం సాధించవచ్చు అని, అందరూ ఐక్యమత్యంగా కలిసి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొంది వాణిశ్రీ సత్యనారాయణ, స్థానిక ఎస్ఐ వేంకటేశ్వరరావు, తాడ్వాయి పోలీసులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.