క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక ధారుడ్యాన్ని పెంచుతాయి

– మున్సిపల్ ఛైర్మన్ రజిత, ఎస్సై మహేష్ 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
కబడ్డీ క్రీడా పోటీలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దారుడ్యాన్ని పెంపొదించి ఏకాగ్రతతో చదువుకోవడానికి తోడ్పడతాయని మున్సిపల్ ఛైర్మన్ రజిత, హుస్నాబాద్ ఎస్సై మహేష్ అన్నారు. శనివారం హుస్నాబాద్ మండలంలోని పోతారం (ఎస్) గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను మున్సిపల్ ఛైర్మన్ రజిత, ఎస్సై మహేష్, టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిఏటా కబడ్డీ టోర్నమెంట్ ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు, సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, కెడం లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.