రెండో రోజు కు చేరిన వ్యవసాయ కళాశాలల క్రీడలు…

– ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్ధిని విద్యార్ధులు
– ఆహ్లాదంగా వీక్షిస్తున్న బోధనా, బోధనేతర సిబ్బంది
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక వ్యవసాయ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం  అంతర్ కళాశాలల క్రీడా పోటీలు రెండవ రోజుకి చేరాయి. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు వరకు ఆటలు రసవత్తరంగా సాగుతున్నాయి. పోటాపోటీగా క్రీడల్లో  పోటీదారులు ఆటలు ఆడుతున్నారు. బాలికల విభాగం టెన్నీకాయిట్ లో అశ్వారావుపేట – సిరిసిల్ల కళాశాలలు  పోటి జరగగా అశ్వారావుపేట విద్యార్ధినులు విజయం సాధించారు. రుద్రూరు ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల –  అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల పోటీ పడగా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్ధినులు గెలుపొందారు. బిస్కస్ త్రో, జావలీన, 200 మీటర్ల పరుగు పందాలు లో బాల్ బాడ్మంటన్ లో అశ్వారావుపేట కళాశాల విద్యార్ధులు రెండవ స్థానంలో నిలిచారు. ఫుట్ బాల్ క్రీడలో అదిలాబాద్ –  సిరిసిల్ల కళాశాల పై అశ్వారావుపేట కళాశాల గెలుపొందింది. క్రికెట్ లో జరిగిన పోటీలో పాలెం కళాశాల పై  జగిత్యాల కళాశాల విజయం సాధించింది. వాలీబాల్ లో క్రీడలో  సంగారెడ్డి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్  టెక్నాలజీ కళాశాల పై  రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల విద్యార్ధులు పై చేయి సాధించారు.విద్యార్దిని విద్యార్థులు ఉత్సాహంగా క్రీడల్లో  పాల్గొంటున్నా.వ్యవసాయ కళాశాల భోధన,బోధనేతర సిబ్బంది ఆహ్లాదంగా క్రీడా పోటీలను వీక్షిస్తున్నారు .