– వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ. యాదగిరి రావు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ బాడ్మింటన్ మెన్ సెలెక్షన్స్ తెలంగాణ యూనివర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు తన చాంబర్లో క్రీడాకారుల ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేసి శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ జి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్లు పూర్తి చేశారు.ఈ సెలెక్షన్స్ కి ఉమ్మడి జిల్లా నుండీ దాదాపు 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో నుండి క్రీడా నైపుణ్యం కలిగిన 5 మంది ని ఎంపిక చేశారు. ఈ ఎంపికైన వర్సిటీ బాడ్మింటన్ టీం చెన్నై లో జరుగు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ లో ఈ నేలా 26.నుండి 29.10.వరకు జరుగు టోర్ని లో పాల్గొంటుందని ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి ఆర్ నేత తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు : నీకేష్, ఉమేష్ (గిరాజ్ కళాశాల) అనిల్,సాయికుమార్ తెలంగాణ యూనివర్సిటీ రోహన్, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల కామారెడ్డి లు ఎంపికయ్యారు.