క్రీడలకు సహకారం అవసరం

Sports require cooperationఐటీ శాఖ మంత్రితో శాట్‌ చైర్మెన్‌ శివసేనా రెడ్డి
హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం, క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌) విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రానున్న కాలంలో తెలంగాణను క్రీడలకు హబ్‌ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. క్రీడల అభివృద్ధికి, శాట్‌ చేపడుతున్న కార్యక్రమాలకు ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి సహాయ సహకారం అందజేయాలని ఆ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబును శాట్‌ చైర్మెన్‌ కే. శివసేనా రెడ్డి కోరారు. ఇటీవల తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీధర్‌ బాబును శివసేనా రెడ్డి ఆత్మీయంగా సన్మానించారు. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో శాట్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.