– స్థలాన్ని పరిశీలించిన శాట్ చైర్మన్
హైదరాబాద్: మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు.. ఆదివాసీ, గిరిజనులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ములుగు జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్) కే. శివసేనా రెడ్డి తెలిపారు. సీఎం కప్ టార్చ్ రిలే కార్యక్రమంలో పాల్గొనేందుకు ములుగు వెళ్లిన శివసేనా రెడ్డి.. మంత్రి సీతక్క సూచన మేరకు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ములుగు స్పోర్ట్స్ స్కూల్‌లో స్విమ్మింగ్, ఆర్చరీ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని శివసేనా రెడ్డి వెల్లడించారు.