నవతెలంగాణ – బెజ్జంకి
గత 46 ఏళ్లుగా నిర్విరామంగా క్రికెట్ టోర్నీ నిర్వహించడం హర్షనీయమని..క్రికెట్ టోర్నీని క్రీడాకారులు సహృదయంతో నిర్వహించుకోవాలని మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు.బుధవారం మండల కేంద్రంలోని మినిస్టేడియంలో నిర్వహిస్తున్న 47వ క్రికెట్ టోర్నీని ఎమ్మెల్యే కవ్వంపల్లి ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్,స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ప్రాముఖ్యమని ఎమ్మెల్యే క్రీడాకారులకు సూచించారు. ఏఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,బీసీ సెల్ మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్,డైరెక్టర్ పులి సంతోష్,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,ఉపాధ్యక్షుడు కర్రావుల శంకర్,యువజన మండలాధ్యక్షుడు సందీప్, మాజీ యువజన మండలాధ్యక్షుడు మంకాలి ప్రవీన్,నాయకులు అక్కరవేణి పోచయ్య,భైర సంతోష్,జెల్లా ప్రభాకర్, మంకాలి బాబు,రాసూరి మల్లికార్జున్,పులి రమేశ్, చెన్నారెడ్డి,సాధీక్ పాల్గొన్నారు.