
– క్రీడ ల ద్వారానే ప్రపంచ స్థాయి గుర్తింపు..
– జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్ : విద్యార్థులు చదువుకి మాత్రమే పరిమితం కాకుండా క్రీడలు మీద కూడా శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవం(మేజర్ ధ్యాన్ చంద్ పుట్ినరోజు )సందర్బంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత తో కలిసి ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా సంబరాలు కార్యక్రమాన్ని ధ్యాన్ చంద్ ఫొటో కి పూలమాల వేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల నుండి రాగానే మైదానం బాట పట్టాలని, ఆటలతో శారీరకంగా , మానసికంగా ధ్రుడత్వం పొందవచ్చని కలెక్టర్ అన్నారు.క్రీడలు ద్వారానే దేశం సత్తా ప్రపంచానికి తెలియజేయవచచని ,క్రీడలలో ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో విజేతలుగా రానిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కానీ ప్రస్తుతం ఎవరు క్రీడలపై ఆసక్తి చూపటం లేదని, తల్లిదండ్రులు పాఠశాల స్థాయి లోనే తమ పిల్లల్ని సెలవు దినాలలో వారికి నచ్చిన క్రీడలలో ప్రావీణ్యం పొందేలాగా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి జి. రామచంద్రరావు,డి.ఈ.ఓ. ఆశోక్,సంక్షేమ అధికారులు శంకర్, లత, జగదీశ్వర్ రెడ్డి, టి.యన్.జి.ఓ. కార్యదర్శి శ్యామ్,పి. ఈ. టి. లు,కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి..
వీ.సీ ద్వారా కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సమాయత్తం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి సూచించారు.ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో ీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ, వచ్చే నాలుగైదు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముందుగా మూడు దశలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలు, చివరగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పకడ్బందీగా దృష్టిని కేంద్రీకరించాలని, జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షణ జరపాలని సూచించారు. శాసనసభ, పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే, పార్టీలకు అతీతంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు సున్నితత్వంతో కూడుకుని ఉంటాయని, ఏమాత్రం అజాగ్రత్తకు తావివ్వకుండా, ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ హితవు పలికారు. ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వంటి ప్రక్రియలను తక్షణమే చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ 6న ఓటరు జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరించి అభ్యంతరాలు స్వీకరించాలని, సెప్టెంబర్ 21 న తుది ఓటరు జాబితాను వెలువరించాల్సి ఉంటుందన్నారు. తుది ఓటరు జాబితాను వెలువరించడానికి ముందే క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, ఏవైనా మార్పులు, చేర్పులకు సంబంధించిన అభ్యర్థనలు వస్తే వాటిని పరిశీలించి ఓటరు జాబితాలో చేర్చే అధికారం కేవలం ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఏ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం లేకుండా ప్రతీ దశలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యానికి తావివ్వకూడదని జాగ్రత్తలు సూచించారు. పంచాయతీరాజ్ చట్టం-2018 తో పాటు, స్థానిక సంస్థల న్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని, ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉన్న ఓటరు జాబితాను గ్రామ పంచాయతీల వారీగా రూపొందించుకోవాలని, అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి గల్లంతు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించాలని అన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో, పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. ఎంపిడిఓలు తమతమ మండలాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్ాయిలో సందర్శించి వాటి స్థితిగతులను పరిశీలించేలా చూడాలన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 600 వరకు ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల సంఖ్య 650 దాటితే అదనపు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఒక వార్డులోని ఓటరుకు మరో వార్డులో ఓటు హక్కు ఉండకుండా జాగ్రత్త వహించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల ఓటు ఒకేచోట ఉండేలా ఓటరు జాబితాను నిశితంగా పరిశీలించాలని అన్నారు. ఎన్నికల నిర్వహ ఏర్పాట్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రతిఒక్కరు తమతమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని, అలసత్వాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామాగ్రిని సమకూర్చుకోవాలని, ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన పోలింగ్ సిబ్బందిని గుర్తించి, వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని, ర్యాండమైజెషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలలో విధులను కేటాయించేలా చర్లు తీసుకోవాలని అన్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయాలతో పాటు మండల స్థాయిలోనూ ప్రత్యేకంగా ఎలక్షన్ సెల్ లను నెలకొల్పి, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేలా చూడాలని ఎన్నికల కమిషనర్ సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ తెజస్ నంద్ లాల్ పవార్, అదనపు కలెక్టర్ బియస్ లత, అర్డిఓ వేణుమాదవ్, జడ్పీ సీఈవో ఆప్పారావు,డిల్ పిఓ యాదగరి, నారాయణరెడ్డి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.