నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలకు తగిన ప్రాధాన్యతనివ్వాలని వ్యవసాయ కళాశాల అసోసియేషన్ డీన్ డాక్టర్ జే.హేమంత్ కుమార్ సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరిక దృఢత్వానికి దోహదపడతాయని ఆయన అన్నారు.స్థానిక వ్యవసాయ కళాశాలలో బుధవారం ప్రభుత్వ పాఠశాలల స్థాయి మండల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు సమాజంలో గౌరవం తీసుకొస్తుందని, క్రీడలు భవిష్యత్ ఆరోగ్యానికి భద్రత కల్పిస్తుందని వివరించారు. ఉన్నత లక్ష్యాలను అధిగమించాలి అంటే చదువుతో పాటు క్రీడా నైపుణ్యం ఆలోచనా శక్తి పెంపుకు ఉపయుక్తంగా ఉంటుందని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. కార్యక్రమంలో ఎంఈవో కీసర లక్ష్మి,షాహీ నా బేగం,పి.రాము, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.