ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు.అందులో భాగంగా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, (బీచ మహాల్లా ) ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థులు ఆడుతున్న క్రీడా పోటీలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలు ఎన్ని రోజుల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఏ ఏ ఆటలు ఎన్ని రోజులు ఆడిస్తున్నారని సంబంధిత ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ఇంగ్లీష్ బోధన మీద విద్యార్థులను ప్రశ్నలు వేసి ఆరా తీశారు. మధ్యాహ్నం భోజనం కమిటీ సభ్యులు పర్యవేక్షణ ఎలా జరుగుతుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. రుచికరమైన ఆహారం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు రామచంద్రం, ఉపాధ్యాయులు కృష్ణమూర్తి,సుదర్శన్ రెడ్డి శ్రీలక్ష్మి,హేమలత సంబంధిత అధికారులు పాల్గొన్నారు.