నీడలతో ‘క్రీడ’లు

'Sports' with shadowsదీపం ఇంటికి వెలుగునిస్తుంది. మరి దాని నీడ.. ఇంటికి అందాన్నిస్తుంది. నీడనూ కళాఖండంలా మార్చేసి ఇంటిని అలంకరిస్తున్నారు సజనకారులు. అవే క్యాండిల్‌ షాడో ప్రొజెక్టర్లు.. వీటిలో నూనె దీపాలు, బ్యాటరీలతో పనిచేసే లైట్లు అలాంటివే. కొవ్వొత్తి /నూనె దీపపు కాంతిలో చేతి వేళ్లను రకరకాలు తిప్పి, గోడపై అమ్మ వేసే నీడ బొమ్మల్ని చూస్తే చిన్న పిల్లలకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో చెప్పనక్కర్లేదు. ఈ షాడో ప్రొజెక్టర్‌ దీపపు బుడ్డీల్లో సువాసనలు వెదజల్లే నూనెను పోసి వెలిగించవచ్చు. కళ ఎంతో అందంగానూ, సహజంగానూ ఉంటుంది. కరెంటుతో, రీఛార్జబుల్‌ బ్యాటరీలతో పనిచేసే షాడో ప్రొజెక్టర్లు ఇవే ఆకారాల్లో వస్తున్నాయి. వీటి వెలుగు కూడా అచ్చం కొవ్వొత్తుల కాంతిలానే ఉంటుంది. అన్నింటికీ మించి రాత్రిపూట వీటితో ఇంటిని ఎంతో వినూత్నంగా అలంకరించుకోవచ్చు.

– ఆనంద ‘మైత్రేయ’మ్‌, హైదరాబాద్‌