నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాలలో సోమవారం అజ్మీర ఇందుకు ఘన స్వాగతం పలికారు. ఇటీవల జాతీయస్థాయిలో సాఫ్ట్బాల్ క్రీడల్లో కెప్టెన్ గా వ్యవహరించి ఇందు జట్టు బంగారు పధకం సాధించిందని కళాశాల ప్రిన్సిపాల్ జి ధనవేని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని అజ్మీర ఇందు బంగారు పతకం జాతీయ స్థాయిలో సాధించినందుకు గర్వంగా ఉందని అన్నారు .మిగతా విద్యార్థులు స్ఫూర్తిని పొంది విద్యలో, క్రీడలలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అధ్యాపక బృందం, విద్యార్థినిలు ఘన స్వాగతం పలికినారు.