నవతెలంగాణ-చేర్యాల
చేర్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల(బాలుర) పాఠశాల, కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో సీఈసీ తోపాటు వివిధ కేటగిరీలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కొరకు శుక్రవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు గురువారం కళాశాల ప్రిన్సిపాల్ బి. అశోక్ బాబు తెలిపారు.పదవ తరగతి ఉత్తీర్ణులై ఆసక్తిగల విద్యార్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఉదయం 10:00 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం 9704550193 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.