నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూర్ మండలంలోని సిద్ధరామేశ్వర నగర్ గ్రామ సమీపంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి పదవ తరగతిలో 9.5 జిపిఏ కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతుందని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి ఒక ప్రకటన తెలిపారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనార్టీ ఖాళీలు ఉన్నాయని, అడ్మిషన్ కొరకు వచ్చే విద్యార్థులు ఒరిజినల్ టి సి, ఆదాయం, కులము, పదవ తరగతి మార్కుల మెమోతో జులై ఒకటవ తేదీ ఉదయం 11 గంటలకు భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో ఉన్న గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలకు హాజరుకావాలని సూచించారు.