– కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర పొందాలని రైతులకు సూచన
నవతెలంగాణ దుబ్బాక రూరల్ : మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో నిలపకుండా వెంట వెంటనే హమాలీ కార్మికులతో తూకం వేసి రైస్ మిల్లర్లకు ధాన్యం తరలించాలని
డిఆర్డిఓ జయదేవ్ ఆర్య దుబ్బాక ఎపీఎం డాకయ్య, ఐకేపీ(సెర్ప్) వివో ఒబీలకు సూచించారు. గురువారం అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని చౌదర్ పల్లి గ్రామంలో ఇటీవల ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభించిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ డిఆర్డిఓ రవీందర్ తో కలిసి డిఆర్డిఓ జయదేవ్ ఆర్య ఆకస్మిక తనిఖీ చేయగా దుబ్బాక మండల పరిధిలోని అప్పనపల్లి ఐకేపీ సెంటర్లో ధాన్యపు బస్తాలకు వేస్తున్న తూకాన్ని దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని అరబెట్టుకుని కొనుగోలు సెంటర్లకు తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దు సూచించారు. అనంతరం ఇప్పటికే దుబ్బాక మండలంలో సెర్ప్ (ఐకెపి) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 27కు గాను 22 సెంటర్లు ప్రారంభించామని ఏపీఎం డిఆర్డిఓ తెలుపగా మరో రెండు మూడు రోజుల్లో మిగతా 5చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని
సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వారీ వెంట ఎంపీడీవో భాస్కర శర్మ, ఏపీవో శ్యామ్ సుందర్ రెడ్డి, ఏవో ప్రవీణ్, ఏపిఎం డాకయ్య, సిసిడీ నర్సింహులు, టిసి చంద్రం, ఏఈఓ అగ్రికల్చర్ రేణుక, పంచాయతీ సెక్రెటరీ కిషన్, వివోఏ హైమావతి, బీకే నాగరాజు గౌడ్, కొనుగోలు కమిటీ సభ్యులు రేణుక, పద్మ తదితరులు ఉన్నారు