
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల లో 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి ఈనెల 29 నా స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ నళిని పేర్కొన్నారు. ఈ నెల 29 నా ఉదయం 10: గంటల నుండి 11 గంటల వరకు తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు. ఎంపీసీ లో రెండు ఎస్సీ కేటగరి, బపీసీలో ఎస్సీ కేటగిరి1, బిసి కేటగిరీలో ఒకటి ఖాళీలు ఉన్నాయని తెలిపారు విద్యార్థులు కళాశాలకు వచ్చినప్పుడు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్ లతో స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరుకావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ నళిని సూచించారు.