నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి ఇతర పీజీ కోర్సులకు సంబంధించిన మిగిలిన సీట్లను భర్తీ చేయాలని, యూనివర్సిటీ లో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ కు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఎల్.ఎల్.బి, ఇతర కోర్సులకు సంబంధించిన సీట్లు మిగిలిపోవడం,విద్యార్థులకు కేటాయించకపోవడం దారుణమన్నారు. తద్వారా పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని తెలిపారు. ప్రైవేటు కళాశాలలకు అనుమతులు ఇచ్చినారని, తెలంగాణ యూనివర్సిటీ కి ఎందుకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించుకునే అవకాశం ఎందుకు ఇవ్వలేరని ప్రశ్నించారు.. అదేవిధంగా బీ.ఎడ్. చదువుతున్న విద్యార్థులకు యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి సౌకర్యం కల్పించాలని కోరినారాన్నారు.తెలంగాణ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్ బి కోర్స్ ప్రవేశపెట్టాలన్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ స్పందిస్తూ, యూనివర్సిటీలో మిగిలిన సీట్ల భర్తీకై అవకాశం ఇస్తారని,హాస్టల్ వసతి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పరిశోధక విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పుప్పాల రవి, పి డి ఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. అనిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, టి జి వి పి జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కల్యాణ్, టి యు వి యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి రాంజీ తదితరులు పాల్గొన్నారు.