
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఖాళీల ను భర్తీ చేయాటానికి ఈనెల 29న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12:00 వరకు స్పాట్ సెలక్షన్ ను నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ నరసింహ రేడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవతరగతి వార్షిక పరీక్షలు మొదటి దఫాలో ఉత్తీర్ణులైన బాలురు నుండి దరఖాస్తులు తీసుకొనున్నట్లు పేర్కొన్నారు. ఖాళీ సీట్లు కేటగిరీ వారిగా బైపీసీ గ్రూపు నందు ఎస్సి కి 03, ఎస్సి-సి 1, మైనార్టీ 1, ఓసి 1, అలాగే ఎంపీసీ ందు ఎస్సి-సి 1,బీసీ 2, మైనార్టీ 1,ఓసి-1 ఖాళీ సీట్ల భర్తీ కోరకు అడ్మిషన్ కోసం విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్థానిక ముధోల్ గురుకుల కళాశాలలో హాజరు కావలసిందిగా ప్రిన్సిపాల్ కోరారు.మీగితా వివరాలకు సెల్ నంబర్ 9848451133 సంప్రదించగలరని పేర్కొన్నారు.