
మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో కూడి మహిళలు సామూహికంగా ఆదివారం శ్రావణ మాసం సందర్భంగా ముత్యాలమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు అధిక సంఖ్యలో సాంప్రదాయబద్ధంగా బోనమెత్తి డప్పు వాయిద్యాల నడుమ బయలుదేరి గ్రామ శివారులోని ముత్యాలమ్మకు మొక్కులు చెల్లించారు. తమ పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సిరి సంపదలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువతీయువకులు పాల్గొన్నారు.