గాంధీభవన్‌ ముందు స్రవంతి నిరసన

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మునుగోడు స్థానిక నేత చలిమేల కృష్ణారెడ్డి తమకు తెలియకుండానే స్థానిక కమిటీలను నియమిస్తున్నారంటూ స్థానిక నాయకులు పాల్వాయి స్రవంతి, కైలాస్‌ నేత గాంధీభవన్‌ ముందు ధర్నాకు దిగారు. తమతో ప్రమేయం లేకుండానే కమిటీలు వేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మెట్ల మీదు కూర్చొని నిరసన తెలిపారు. మునుగోడు ఇంచార్జిలాగా చలిమేల వ్యవహరిస్తున్నారని స్రవంతి ఆరోపించారు. దీనిపై టీపీసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.