వైభవంగా శ్రీ కనకదుర్గ దేవి మల్లేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం

నవతెలంగాణ- ఆలేరుటౌన్‌
శ్రీ కనకదుర్గాదేవి 8 వార్షికోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో పట్టణ పుర ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యుల, భక్తుల సమక్షంలో శ్రీ కనకదుర్గా దేవి మల్లేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా, ఆలయ ప్రధాన అర్చకులు వేదాటి రంగన్న పంతులు సమక్షంలో వేదమంత్రోచ్ఛ రణాల మధ్యన మేళ తాళాలతో నిర్వహించారు. అంతకుముందు మల్లేశ్వర స్వామిని స్థానిక శివాలయం నుండి పట్టణ పురవీధుల గుండ డప్పు చప్పుళ్లు మేళ తాళాలు వాయిద్యాల చెప్పులతో ఊరేగింపుగా శ్రీ కనకదుర్గ ఆలయానికి అంబారిపై ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది. స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. నవ దుర్గా లను ఆలయ ప్రాంగణం చుట్టూ అందంగా చిత్రీకరించారు. మంగళవారం భక్తులు బోనాలు నైవేద్యంగా తీసుకువచ్చి శ్రీ దుర్గా దేవి, మల్లేశ్వర స్వామి కి నైవేద్యంగా సమర్పించారు. బుధవారం బంధుమిత్రులతో కలిసి ఆలేర్‌ పట్టణంలోని ప్రజలు చెట్ల కిందికి వెళ్ళనున్నారు. నాలుగు రోజులగా వార్షికోత్సవం కార్యక్రమాలు జరుగుతున్నాయి. 28వ తేదీ ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు గణపతి పూజ , పుణ్యవచనం, రిత్విక వరణం, అమ్మవారిక అభిషేకములు, కలశస్థాపన , అర్చన , తీర్థ ప్రసాద వితరణ ,సాయంత్రం 6 గంటలకు అర్చన , తీర్థ ప్రసాద వితరణ, 29వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు నిత్య పూజ, పారాయణం, అమ్మవారి హోమం, సాయంత్రం నాలుగు 35 నిమిషాలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ కనకదుర్గాదేవి, మల్లీశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, నిత్య పూజ, తీర్థ ప్రసాద వితరణ, మంగళవారం ఉదయం నిత్య పూజ, తీర్థ ప్రసాద వితరణ,30 వ తేదీ ఉదయం 8 గంటల నుండి అమ్మవారికి బోనాలు సమర్పించుట, 31వ తేదీ బుధవారం బంధుమిత్రులతో వనభోజనాలు , చెట్ల కిందికి వెళ్ళుట జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పుర ప్రముఖుల ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు పండగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్‌ కొలుపుల హరినాథ్‌, సభ్యులు, పురపాలక సంఘం చైర్మెన్‌ వస్పరి శంకరయ్య, వాయిస్‌ చైర్మన్‌ మొరిగాడి మాధవి వెంకటేష్‌, పిఎసిఎస్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ చింతకింది చంద్రకళ మురహరి, పిఎసిఎస్‌ మాజీ చైర్మన్‌ మొరిగాడి చంద్రశేఖర్‌, వార్డు కౌన్సిలర్‌ బేతి రాములు, బండిరాజుల శంకర్‌, పడిగల రాజు , ఘన గాని శంకర్‌, ఘనగాని ఆనంద్‌,సీత నవీన్‌, జూకంటి ప్రవీణ్‌, నాలం అయ్యప్ప,పాసికంటి కృష్ణ,బెల్దే శ్రీధర్‌,సముద్రాల సత్యం ,అయితే వెంకటేష్‌, పులగం భాస్కర్‌, బోట్ల విశ్వం, కలకోటి జంపయ్య, బెల్దే నాగరాజు, బోట్ల సంపత్‌, రాపోలు మధుసూదన్‌, ఎలుగల సాత్విక్‌ దేవ్‌, వెలగల సాహిత్‌ రాజ్‌ ,సముద్రాల శ్రీనివాస్‌, బేల్దే కాశీనాథ్‌, ములుగు అమర్నాథ్‌, బద్రీనాథ్‌,రాజేశ్వర్‌, ఎగిడి మల్లయ్య, ఎలుగల కృష్ణ, గోవర్ధన్‌ రెడ్డి, పూల నాగయ్య, డాక్టర్‌ ప్రభాకర్‌, ఉమేష్‌, వెంకటేష్‌,జూకంటి కృష్ణ, చిమి. ఆనందు,బాల్‌ దే రాములు, బాల్‌ దే శేఖర్‌, బాల్‌ దే కృష్ణ,భీమేష్‌,ఆంజనేయులు, మధ్యల కృష్ణ, బొడ్డు రమేష్‌, కొప్పు ఉమేష్‌ పాల్గొన్నారు.
శ్రీ కనకదుర్గాదేవికి బోనాల సమర్పణ
శ్రీ కనకదుర్గ ఆలయ ఎనిమిదో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహిళా భక్తులు పట్టణంలోని సంతోష్‌ నగర్‌ ,కొలనుపాక రోడ్డు, రంగనాయక వీధి, గణేష్‌ నగర్‌, జ్ఞానోదయ కాలనీ, బొడ్రాయి, రంగనాయక వీధి, పెద్దమ్మ వాడ,రామ్‌ శివాజీ నగర్‌, అంబేద్కర్‌ నగర్‌, రఘునాధపురం రోడ్‌ కాలనీ,రైల్వే గేటు ,పోచమ్మ వీధి, క్రాంతి నగర్‌ , సిల్క్‌ నగర్‌ , బీసీ కాలనీ, మైత్రి కాలనీ , వడ్డెర బస్తి, చింతల్‌ బస్తి, బృందావన్‌ కాలనీ, లక్ష్మీ విలాస్‌, కాటమయ్య నగర్‌, రెడ్డిగూడెం,ఆదర్శనగర్‌ తో పాటు, పట్టణంలోని పలు కాలనీల నుండి మహిళా భక్తులు ఆలయం వద్దకు డబ్బు చప్పుల మధ్య తరలివెళ్లి శ్రీ కనకదుర్గాదేవి, మల్లేశ్వర స్వామి వార్లకు నైవేద్యంగా బోనాలు, నూతన వస్త్రాలు సమర్పించారు. పిండి వంటలు, పాయసం ప్రసాదం పంచారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు ఎలుగల లక్ష్మి, ఎలుగల భాగ్యమ్మ , ఎలుగల శోభ, ఎలుగుల సువర్ణ, ఎలుగల పద్మ, ఎలుగల స్వర్ణలత, రమా, సంధ్య , సోమాశెట్టి హేమలత, మొరిగాడి ఇందిరా, సీస మహేశ్వరి , నీలం పద్మ, ఎలుగల సంగీత, ఎలుగల సావిత్రి పాల్గొన్నారు.
శ్రీ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్న బిక్షమయ్య గౌడ్‌
ఆలేరు పట్టణం లో దుర్గా మాత ఉత్సవాల సందర్బంగా శ్రీ కనక దుర్గా దేవి, మల్లేశ్వర స్వాములను ఆలేరు మాజీ శాసనసభ్యులు బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు బూడిద భిక్షమయ్య గౌడ్‌ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ కొలుపుల హరినాథ్‌ , కార్యనిర్వాహకులు భేతి రాములు బిక్షమయ్యకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం వైస్‌ చైర్మెన్‌ మొరిగాడి మాధవి వెంకటేష్‌, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ కే. సాగర్‌ రెడ్డి, పుట్ట పవన్‌ పాల్గొన్నారు.