శ్రీఆనందగిరి లక్ష్మినృసింహాస్వామి కళ్యాణం

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి మండలం కొలిప్యాక్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఉదయం  స్వామి వారికి సుప్రభాత సేవ ,పంచామృత అభిషేకము,సర్వ దేవత పూజా,హోమం,ప్రాత: బలిహారణం  మ.12 గం.లకు స్వామి వారి కళ్యాణంలో భాగంగా కొండ ప్రదక్షిణ ద్వార స్వామి అమ్మ వార్లకు ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు .వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య  ఆలయ అర్చకులు దండాల మోహన్ శర్మ అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని  నిర్వహించారు. 24.2.2024 రోజు మ.1.00 గం.కు స్వామి  వారి రథోత్సవము(జాతర) నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ ప్రశాంత్ తెలిపారు.