శ్రీ అయ్యప్ప స్వామి రథోత్సవం కార్యక్రమం బుధవారం మండల కేంద్రంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గాంధీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పురవీధుల్లో స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు ఎంతో పవిత్రంగా స్వామివారి రథోత్సవాన్ని ముందుకు సాగే విధంగా సహకరిస్తూ భక్తిపారవశ్యంతో తన్మయిలయ్యారు. అనంతరం ఆలయంలో మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది,, ఈ రోజు సాయంత్రం అయ్యప్ప స్వామి ఆలయం లో పడిపూజ కార్యక్రమం జరుగును,, ఈ మండలి పూజా కార్యక్రమాన్ని దాత జనగాని కుమార్ లైన్మెన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ,కావున ఈ రోజు సాయంత్రం అయ్యప్ప స్వామి ఆలయం లో 8 గం లకు జరిగే మండలి పూజా కార్యక్రమా ల్లో గ్రామ ప్రజలు,భక్తులు ,అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకో గలరని కోరుచున్నామని అయ్యప్ప మండలి సభ్యులు తెలిపారు.