జయంతి ఉత్సవాలకు ముస్తాబైన శ్రీ భక్త మార్కండేయ మందిరం..

– నేడే జయంతి ఉత్సవాలు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని పద్మశాలి గల్లీలో గల శ్రీ భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు ఫిబ్రవరి 1న జరగనున్నాయి. ఈ జయంతి ఉత్సవాల కోసం మార్కండేయ మందిర కమిటీ సభ్యులు అన్ని అంగుళాలతో ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1న నిర్వహించే శ్రీ భక్త మార్కండేయ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేయడమే కాకుండా జయంతి రోజున వివిధ కార్యక్రమాలను నిర్వహించడం ఆలయ ఆవరణంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఈ జయంతి ఉత్సవాలకు పద్మశాలి కులస్తుల కాకుండా గ్రామ ప్రజలు పాల్గొని.. ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేశారు.