నాసా కాన్ఫరెన్స్‌లో శ్రీచైతన్య విద్యార్థుల హవా..

హైదరాబాద్‌: అమెరికా నాసాకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ ఐఎస్‌డిసి కాన్ఫ రెన్స్‌కు భారత్‌ నుంచి అత్యధిక మంది శ్రీచైతన్య విద్యా సంస్థల విద్యార్థులు హాజరయ్యారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీచైతన్య స్కూల్‌ అకాడమిక్‌ డైరెక్టర్‌ సీమ మాట్లాడుతూ.. అమెరికాలోని డల్లాస్‌ నగరంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఐఎస్‌డిసి కాన్ఫరెన్స్‌కు 225 మంది విద్యార్థులు హాజరు కాగా.. వారిలో భారత్‌ నుంచి 105 మంది రాగా.. 101 మంది శ్రీచైతన్య విద్యార్థులేనని తెలి పారు. నాసా-ఎన్‌ఎస్‌ఎస్‌ స్పెస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌ -2023లో ఇండి యా నుండి 25,000 మంది విద్యార్థులు హాజరవ్వగా అందులో 105 మంది ఐఎస్‌డిఎస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం దక్కిందన్నారు. ఎపి, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి తమ విద్యార్థులే ఎక్కువ అవకాశాలను దక్కించుకున్నారన్నారు. గత 12 ఏళ్లుగా తమ సంస్థ విద్యా ర్థులు ఈ ఘనతను సాధిస్తున్నారన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ నిర్వహించిన స్పేస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌లో శ్రీచైతన స్కూల్‌ 54 ప్రాజెక్టులు గెలు పొందిందన్నారు. ఐఎస్‌డిసి కాన్ఫరెన్స్‌కు హాజరైన అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత బిఎస్‌ రావు ప్రశంసించారు.