శ్రీ చైతన్య టెక్నో హై స్కూల్ నిజామాబాద్-1 బ్రాంచ్ పాఠశాలలో శనివారం ఉత్తమ రైతు అవార్డు గ్రహీత చిన్నికృష్ణుడు స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం ( Smart Living program) లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించడానికి కల్తీ లేని ఆహారాన్ని పొందడం తప్పనిసరి అని విషపూరిత మందులు, ఎరువులు లేకుండా సేంద్రియ ఎరువులను వాడుతూ పంటలను ఎలా పండించాలో వివరించారు. ఈ నేల తల్లి మట్టిని విషంతో కలిసితం చేయకుండా భూమిని కాపాడుతూ వ్యవసాయం ఎలా చేయవచ్చో చక్కగా విద్యార్థులందరికీ వివరించి చెబుతూ తమయొక్క అనుభవాన్ని, అమూల్యమైన సలహాలను, సూచనలను వివరించడం జరిగింది. దీనివల్ల ప్రతి మనిషి దీర్ఘకాలం పూర్తి ఆరోగ్యంతో ఉంటూ ఎటువంటి అనారోగ్య సమస్యల వల్ల వైద్యుల వద్దకు వెళ్ళనవసరం లేదని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం జితేంధర్, ప్రిన్సిపాల్ హుస్సేన్ , కో ఆర్టినేటర్ నరేందర్, అకాడమిక్ డీన్ ఈశ్వర్, ఐ.పి.ఎల్ ఇన్చార్జ్ శివకుమార్, సి బ్యాచ్ ఇంచార్జ్ రాజు, ఉపాద్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.