నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు విజయభేరి మోగించారు. ఈ మేరకు శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముగ్గురు విద్యార్థులు తన్నీరు ప్రణతి, సిహెచ్‌విఎస్ చంద్ర, పరిమి సాయి లాస్య అత్యధిక మార్కులు 598 సాధించి విజయ కేతనం ఎగరవేశారని తెలిపారు. ఆరుగురు విద్యార్థులు రెండో అత్యధిక మార్కులు 597తోపాటు 15 మంది విద్యార్థులు 596 మార్కులు, 31 మంది 595 మార్కులు, 524 మంది 590 మార్కులు, 2,353 మంది 580 ఆపైన మార్కులు సాధించారని వివరించారు. మ్యాథ్స్ సబ్జెక్టులో వందకు వంద మార్కులు సాధించిన విద్యార్థులు 3,370 మంది, సైన్స్ సబ్జెక్టులో వందకు వంద మార్కులు సాధించిన విద్యార్థులు 945 మంది, తెలుగు సబ్జెక్టులో వందకు వంద మార్కులు సాధించిన వారు 1,745 మంది కలిపి మొత్తం 7,394 మంది వందకు వంద మార్కులు సాధించారని పేర్కొన్నారు. శ్రీచైతన్యలో 98.9 శాతం ఉత్తీర్ణత నమోదైందనీ, 132 బ్రాంచులు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయని తెలిపారు.