హైదరాబాద్: ఏపీపీఎస్‌సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాలలో శ్రీచైతన్య ఐఎఎస్ అకాడమి విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. స్టేట్ 1వ ర్యాంక్‌తో పాటు మంచి సెలక్షన్స్ సాధించి సంస్థ ఔన్నత్యాన్ని మరోమారు సాటారని పేర్కొంది. గతంలో శ్రీచైతన్య ఐఎఎస్ అకాడమిలో ఇంటర్, డిగ్రీలలో ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదివిన భానుశ్రీ లక్ష్మీ గ్రూప్-1 తొలి ర్యాంక్ కైవసం చేసుకుని డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారని వెల్లడించింది. మరో అభ్యర్థి బోడెల్ సుజిత అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ టాక్స్ ఆఫీసర్‌గా, ఆర్‌టిఒగా గోపి శెట్టి మనోహార్, ఎంపిడిఒలుగా వెల్లపనేని జ్యోతి, శ్రీసాయి హర్ష, మున్సిపల్ కమిషనర్‌గా బి రమ్య కీర్తన సెలక్షన్స్ సాధించారని తెలిపింది. శ్రీచైతన్య ఐఎఎస్ అకాడమిలో ఇంటర్, డిగ్రీలలో ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదివిన విద్యార్థులు గ్రూప్-1లోనూ టాపర్స్‌గా నిలిచి.. వివిధ సర్వీసులకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. విజేతలకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.