
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ జోఢాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి పునస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వారికి దేవాలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు, అనంతరం స్వామివారి మేమెంటో, ప్రసాదాన్ని అందజేశారు. హనుమాన్ దేవాలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో మారుతి తెలియజేశారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కొరకు మై వేములవాడా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 200 క్యాన్ల చల్లటి నీరును, అదేవిధంగా 3000 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు మైవేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, గొంగళ్ళ రవికుమార్, డాక్టర్. బెజ్జంకి రవీందర్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, గుమ్మడి కుమార్, డాక్టర్. కళా అశోక్, గొండ ప్రసాద్, పసూల శ్రీనివాస్, పొలాస రాజేందర్, చొక్కాల వనజ, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.