ఆత్రేయ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణంలోని ఆత్రేయ పాఠశాలలో చిన్నారులు కృష్ణ,గోపికల వేషధారణలో నృత్యాలతో అలరించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ మాధురి మాట్లాడుతూ చిన్ననాటి నుండే పిల్లల్లో ఆధ్యాత్మికత, సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తూ, జగద్గురువు అయిన శ్రీ కృష్ణ భగవత్ గీత ప్రాధాన్యతను వివరిస్తూ జీవిత సారాంశాన్ని బోధించాలని తల్లిదండ్రులను కోరారు. ఇట్టి కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నరేష్, ఉపాధ్యాయులు వంశీ, శ్రావణ్, మౌనిక, అనూష, ప్రణీత, రాకేష్ తదితరులు పాల్గొన్నారు..
హౌసింగ్ బోర్డ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో..
హౌజింగ్ బోర్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో  ఆంజనేయ స్వామి, దుర్గామాత ఆలయం లో శ్రీ కృష్ణాష్టమి పర్వదినం ను ఘనంగా కమిటీ అధ్యక్షులు మోహన్ దాస్ నిర్వహించారు. ఈ సందర్బంగా మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది భక్తులు శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు జరుపుకుంటారని, అదేవిదంగా ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఆలయములో నిర్వహిస్తామని అభిషేకం, అర్చన, శ్రీ కృష్ణుని ఉయ్యాలలో కూర్చోబెట్టి ఉయ్యాల సేవ చేసి హారతి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు నారాయణ గౌడ్, గడ్డం శ్యామ్ సుందర్, కొక్కుల రమేష్, హేమ లత, రూప మీనా, పుష్ప, హేమ తదితరులు పాల్గొన్నారు..