సరస్వతి శిశు మందిర్ లోఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

నవతెలంగాణ- తాడ్వాయి 
తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు గురువారం రోజున ఘనంగా నిర్వహించారు.. చిన్నారులంతా శ్రీ కృష్ణుని వేషధారణలో,అందమైన గోపికమ్మల వేషధారణలో అలరించారు.ఈ ఉత్సవంలో భాగంగా చిన్నారులు ఉట్టి కొట్టారు.ఈ కార్యక్రమం గురించి   పాఠశాల    ప్రధానోపాధ్యాయులు రవి మాట్లాడుతూ ద్వాపర యుగంలో బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణుడు జన్మించాడని,దేవకీ వసుదేవులకు అష్టమ సంతానం అని,శ్రీ కృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారమని తెలిపారు. కృష్ణాష్టమి రోజు పిల్లలందరూ మరింత ఉత్సాహంతో పాల్గొనేలా ప్రోత్సహించారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఉపాద్యాయులు,తల్లి దండ్రులు కారణం అయ్యారని అన్నారు.ఈ ఉత్సవంలో పాఠశాల ఉపాద్యాయులు,తల్లి దండ్రులు, తదితరులు పాల్గొన్నారు