మండలంలోని ఆయా గ్రామాల్లోని స్వాద్యాయ కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణుడు, గోపికలుగా చిన్నారుల వేషాధారణ తో ప్రధాన వీదుల గుండా తిరుగుతూ కృష్ణం వందే జగత్గుగూరు అంటూ ర్యాలీ నిర్వహిండం అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో భాగంగా చిన్నారులతో ఉట్టి కొట్టించారు. అనంతరం శ్రీకృష్ణుని పాటలపై చిన్నారులు నృత్యాలతో సందడి చేశారు. అంగన్వాడీ కేంద్రంలో క్కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్నారులను కృష్ణుని, గోపికల వేషధారణలు అందర్నీ అలరించారు. ఈ సందర్భంగా నృత్యాలు, దాగుడుమూతలు కోలాటం వంటి కారయక్రమాలు చేపట్టారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సహంగా పాల్గొన్నారు. కృష్ణాష్టమి విశిష్టతను ఉపాద్యాయురాళ్ళు చిన్నారులకు తెలియజేశారు. చిన్నపిల్లలకు పలువురు తల్లిదండ్రులు రాధాకృష్ణ వేషధారణలతో ఇంటి వద్ద అలంకరించి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.