నిజామాబాద్ నగరంలోని 18వ డివిజన్లోని వివి నగర్ కాలనీ లో గల శ్రీ శివ సాయి బాబా మందిరంలో శ్రీ శివ సాయి బాబా మందిరం వివి నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు పురస్కరించుకొని సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణతో అలంకరణ కాగా బాలికలు గోపికల వేషం వేసుకొని కాలనీలోని ప్రతి ఒక్కరిని అలరించారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించగా కృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులు పుట్టిని పగలగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా వివి నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని పెద్దలు మహిళలు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.