ఏర్గట్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 వ తేదీ శనివారం నుండి గ్రామాభివృద్ధి కమిటీ,ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమవుతాయని ఆలయ ప్రధానార్చకులు ధరూరి రజినీకాంతాచార్యులు తెలిపారు. 10 వ తేదీ సోమవారం లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం, 12 వ తేదీ బుధవారం రాత్రి 9-09 నిమిషాలకు రథోత్సవం, జాతర , 13 వ తేదీ గురువారం అన్నప్రసాదం ఉంటుందని,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.