శ్రీ లక్ష్మీనరసింహ వైన్స్, శ్రీ సాయి వైన్స్ లను తొలగించాలి: ఎస్ఎఫ్ఐ

– ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సీఐ తాతాజీకి వినతి పత్రం అందజేయడం జరిగింది
నవతెలంగాణ – శాయంపేట
శాయంపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ వైన్స్ అలాగే కొప్పుల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సాయి వైన్స్ ల ను వెంటనే తొలగించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం రోజున పరకలలో ఎక్సైజ్ ఆఫీస్ లో సీఐ తాతాజీ గారికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ చట్ట ప్రకారం ప్రభుత్వ నియమా నిబంధనలు పాటించకుండా పబ్లిక్ ఏరియాలో ప్రజలు విద్యార్థులు వాహనదారులు తిరిగే రహదారికి అనుకొని వైన్స్ షాపులు పెట్టి నడుపుతున్నారన్నారు. దీనివలన మందు బాబులు నటి రోడ్డుపై వాహనాలు నిలిపి త్రాగుతూ ప్రజలకు విద్యార్థులకు వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారన్నారు. అలాగే ఈ వైన్స్ షాపులు చట్ట ప్రకారం ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం లేవన్నారు అంతే కాకుండా ట్రాలీ ఆటోలో శాయంపేట మండలలోని అన్ని గ్రామాలలో మొత్తం దొంగ చాటుగా బీర్లు మందు సరఫరా చేస్తున్నారన్నారు. దీనివలన గ్రామాల్లో ఉండే యువత విద్యార్థులు త్రాగుడుకి అలవాటు పడి తప్పుడు మార్గంలో వెళ్లే పరిస్థితి ఉంది అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చట్టా ప్రకారం చర్యలు తీసుకొని పబ్లిక్ ఏరియాలో ఉన్న వైన్ షాప్ లను తొలగించాలన్నారు లేదంటే హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు మడికొండ ప్రశాంత్, బొచ్చు ఈశ్వర్, గణేష్, పవన్, తదితరులు పాల్గొన్నారు.