మాంచెస్టర్: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టు తొలిటెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 236పరుగులకే ఆలౌటైంది. రత్నాయకే(72), ధనుంజయ(74) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లు వోక్స్, బషీర్ మూడేసి వికెట్లతో, అట్కిన్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఓవర్‌నైట్ స్కోర్ 8వికెట్ల నష్టానికి 178పరుగులతో గురువారం తొలిరోజు ఆటను కొనసాగించిన శ్రీలంక మరో 58 పరుగులు జతచేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు 47ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 208పరుగులు చేసింది. రూట్(42)కి తోడు బ్రూక్(56) అర్ధసెంచరీతో మెరిసాడు. ఆ సమయానికి వికెట్ కీపర్ స్మిత్(46), వోక్స్(7) క్రీజ్‌లో ఉన్నారు.