– కివీస్‌తో మూడో వన్డే వర్షార్పణం
పల్లెకల్: న్యూజిలాండ్‌పై శ్రీలంక జోరు కొనసాగుతుంది. ఇటీవల టెస్టుల్లో ఆ జట్టును క్లీన్‌స్వీప్ చేసిన లంకేయులు.. తాజాగా వన్డే సిరీస్‌ను 2-0తో దక్కించుకున్నారు. మంగళవారం జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దుగా ముగిసింది. న్యూజిలాండ్ 21 ఓవర్లలో 112/1తో ఆడుతుండగా.. వర్షం ఆటకం కలిగించింది. ఎడతెరపి లేని వర్షంతో మ్యాచ్ సాగలేదు. తొలి వన్డేలో శ్రీలంక 45 పరుగుల తేడాతో, రెండో వన్డేలో 3 వికెట్లతో విజయాలు సాధించింది. దీంతో 2-0తో సిరీస్ సాధించింది. కుశాల్ మెండిస్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.