ఇల్లు కూలిన బాదిత కుటుంబాలకు శ్రీరామకృష్ణ సేవా ట్రస్టు ఆర్ధిక సహాయం

నవతెలంగాణ- మంగపేట: గత వారం రోజుల నుండి మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాలలో ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులై కుటుంబాలకు రాజుపేట శ్రీరామక్రుష్ణ సేవా ట్రస్టు చైర్మన్ బాడిశ నాగ రమేష్ ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం మండలంలోని కొత్త మల్లూరుకు చెందిన గుండారపు రామకృష్ణ, నాగమణి, బాలన్నగూడెం గ్రామపంచాయతీ నరేందర్రావుపేటకు చెందిన తాటి అనురాధ కుటుంబాలను పరామర్శించి తక్షణ సహాయంగా నగదు, 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో పోడెం రాంబాబు, వట్టం శ్రీను, మాటూరి వినోద్, పరమేశ్వరరావు, గుమ్మల నరసింహ, బట్ట ప్రణయ్, మునిగేల హరికృష్ణ, గుమ్మల గణేష్, బట్టా యశ్వంత్, గుమ్మల కృష్ణవేణి, సరోజన, కోటి, మాటూరి చెంచులక్ష్మి, సరిత, ట్రస్ట్ సభ్యులు బాడిశ నవీన్, ఆదినారాయణ, ఇందారపు రమేష్, గుమ్మల వీరస్వామి, మునిగేల మహేష్, నరేష్, చౌలం సాయిబాబులు పాల్గొన్నారు.