
– ములుగు జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి
నవతెలంగాణ-కొత్తగూడ:- శ్రీరాములు అకాల మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని ములుగు జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు. మండలంలోని గుంజేడు గ్రామానికి చెందిన గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరబోయిన శ్రీరాములు గురువారం గుండెపోటుతో మరణించడంతో మండల అధికార ప్రతినిధి బానోతు నెహ్రూ ద్వారా సమాచారం తెలుసుకొని మహబూబాద్ జిల్లా కేంద్రం నుండి హుటాహుటిన గుంజేడు గ్రామానికి చేరుకొని సిరబోయిన శ్రీరాములు మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన మా పార్టీ నాయకుడు శ్రీరాములు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.వారి కుటుంబానికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో నేనున్నానని చెప్పారు. అనంతరం శ్రీరాములు కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి వెంట బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కొమ్మన బోయిన వేణు, మండల అధికార ప్రతినిధి బానోత్ జవహర్ లాల్ నెహ్రూ, సర్పంచ్ అజ్మీర రజిత రమేష్ నాయక్, ఉప సర్పంచ్ సిరబోయిన శ్రీను, బిఆర్ఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఈసం స్వామి, ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి సిరిగిరి సురేష్, ఆవుల రమేష్, దారం సమ్మయ్య, దస్తగిరి, పసుల గట్టయ్య, జిమ్మిడి శ్రీనివాస్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.