శ్రీ శివసాయి బాబా మందిర్ ఆలయ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక 

నవతెలంగాణ – కంటేశ్వర్ 
శ్రీ శివ సాయి బాబా మందిర్ వివి నగర్ కాలనీ ఆలయ కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బంగారు గంగారం, రఘువీర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా విశ్వజిత్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ గా కోటేశ్వరరావు, కోశాధికారిగా శ్యాంసుందర్, సలహాదారులుగా ఆంజనేయులు భూపాల్ రెడ్డి రామచందర్ రెడ్డి లక్ష్మణ్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ శివ సాయి బాబా మందిర్ వివి నగర్ కాలనీ ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ కమిటీ అభివృద్ధికి కమిటీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.