దసరా బరిలో శ్రీశ్రీశ్రీ రాజావారు

Sri Sri Sri is the king of Dussehra ring‘మ్యాడ్‌, ఆయ్‌’ లాంటి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాల హిట్స్‌తో హీరో నార్నెే నితిన్‌ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘శతమానం భవతి’ దర్శకులు సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్‌ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ, ‘మా చిత్ర హీరో నార్నే నితిన్‌ ఇటీవల మంచి ఫీల్‌ గుడ్‌, యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీస్‌తో వరుస విజయాలు అందుకుంటున్నారు. వీటికి భిన్నంగా మా సినిమా ఉంటుంది. పూర్తి కమర్షియల్‌ ఫార్మాట్‌లో భారీ తారాగణంతో దర్శకుడు సతీష్‌ వేగేశ్న తెరకెక్కించారు. ఎన్టీఆర్‌ ఎంతో మెచ్చి… ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ దసరాకి నార్నే నితిన్‌ ఖాతాలో ‘ఆయ్‌, మ్యాడ్‌’ తరహాలో హ్యాట్రిక్‌ హిట్‌ పడుతుందని నమ్ముతున్నాం’ అని అన్నారు.