అవార్డు అందుకున్న శ్రీ వేంకటేశ్వర గ్రామైక్య సంఘం: ఏపీఎం వరదయ్య 

నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని చిన్న ముప్పారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర గ్రామైక్య సంఘం కు రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు లభించిందని నెల్లికుదురు మండల ఏపిఎం వరదయ్య తెలిపారు. శనివారం రాష్ట్రస్థాయిలో బ్యాంకు లింకేజీ ప్రథమ స్థానం ముప్పారం గ్రామంలోని వెంకటేశ్వర గ్రామైక్య సంఘం కు కేసముద్రం యూనియన్ బ్యాంక్ మూడు కోట్ల రూ.50 లక్షలు రుణ అందించడం పట్ల అవార్డును ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ సుల్తానా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత చేతుల మీదుగా అవార్డు అందుకునే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లికుదురు ఉమ్మడి మండలంలోని చిన్న ముప్పారం గ్రామంలో ఉన్న ఎస్ హెచ్ జి గ్రూపులకు బ్యాంకు లింకేజీలు కేసముద్రం మండలంలోని ఉన్న యూనియన్ బ్యాంక్ వారు అధికంగా రుణాలు అందించడం పట్ల ఈ అవార్డు వచ్చిందని తెలిపారు. ఈ అవార్డును ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ సుల్తానా మరియు మంత్రి సీతక్క చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర వివో సంఘం అవార్డు అందుకోవడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. దీంతో అక్కడి మహిళలు  అభివృద్ధి చెందేందుకు ఈ రుణాలు ఎంతగానో దోహదపడ్డాయని అన్నారు. ఆ యూనియన్ బ్యాంకు రుణాలు అందించడం పట్ల మహిళా సంఘాలు అభివృద్ధి చెందుతున్నందున హర్ష వ్యక్తం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కేసముద్రం యూనియన్ బ్యాంక్ వివో సంఘాలకు అధికంగా రుణాలు ఉంచడం పట్ల మహిళా సంఘాలు హర్ష వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు లింకేజీ డిపిఎం గడ్డం శ్రీనివాస్ గౌడ్ మరియు ఏపీ డి జయశ్రీ మండల సమైక్య అధ్యక్షురాలు పెరుమాళ్ళ కవిత గ్రామ సంఘం అధ్యక్షురాలు మల్లం శారద  సీసీ బుర్ర  రామానుజన్ వివో ఏ రాయలి కవిత తదితరులు పాల్గొన్నారు.