మండలంలోని సుంకిశాలలో కొలువై వున్న శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేధ్వర స్వామీ ఆలయ ప్రాంగణంలో 26 వ వార్షిక బ్రహ్మ్మోత్సవాలలో బాగంగా ఆదివారం స్వామివారి కళ్యాణం భక్తుల కన్నుల పండుగగా వేద పండితుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు భారీ ఊరేగింపుగా మేళ తాళాలతో ఉత్సవ విగ్రహాలను కళ్యాణ వేదికకు తరలింపు తో పాటు ఎదురుకోళ్ల ఘట్టాన్ని నయనానంద కరంగా నిర్వహించారు.స్వామీ వారి కళ్యాణానికి పారిశ్రామిక వేత్త పైళ్ల సంజీవ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.ఈ కల్యాణంలో జెడ్పి ఛైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీపీ నూతి రమేష్ , జడ్పిటిసి వాకిటి పద్మా అనంత రెడ్డి, పైళ్ల రాజా వర్ధన్ రెడ్డి, నర్సింహా, చెరుకు శివయ్య, తుమ్మల యూగందర్ రెడ్డి, బోళ్ల శ్రీనివాస్, పాశం సత్తి రెడ్డి, పైళ్ల ఉపేందర్ రెడ్డి, వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.