
భువనగిరి శివారులోని రాయ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య తెలిపారు. కాగా శుక్రవారం వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కోనేరు వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి, లైటింగ్ ఇతర ఏర్పాట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నాయిని అరుణ పూర్ణచందర్, గ్రామ నాయకులు దాసరి శ్రీనివాస్, సుదగాని మహేందర్, పోచంపల్లి భరత్ లు పాల్గొన్నారు.