రంగ రంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం..

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం కళ్యాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం రంగ రంగ వైభవంగా జరిపారు. రథసప్తమి పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులు మహా యజ్ఞం, కళ్యాణోత్సవం, అన్నదాన కార్యక్రమాలు, నిర్వహించారు. బుధవారం గ్రామంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను చేయనున్నట్లు ఆలయ, గ్రామ, కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం జరుపగా రెండు గంటలు కూర్చున్నారనీ ఆలయ పూజారి లింగం తెలిపారు. ఈ కళ్యాణోత్సవానికి గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలందరూ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులందరికీ అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. మంగళవారం గ్రామంలో జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గాండ్ల నాగరాజ్, కిన్నెర మోహన్, గంగోని శంకర్, బాలయ్య, ప్రవీణ్, పోతున్న, శ్రీనివాస్, ఓ మోహన్, జలయ, మైని మోహన్, విజయ్ ,వీరయ్య,  రామచంద్ర రావు, లింగం, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.