– భక్తులకు అన్నదాన కార్యక్రమం
నవతెలంగాణ – రెంజల్
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కళ్యాపూర్ గ్రామంలో రథసప్తమి నీ పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా, వేదమంత్రాలతో జరిగింది. ప్రతి ఏటా రథసప్తమి నాడు ఈ వేడుకను ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతుందని ఆలయ పూజారి లింగం పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీతోపాటు, గ్రామ పెద్దల సమక్షంలో ఈ వేడుకను కన్నుల పండుగ గా జరుపుకుంటారు. కల్యాణోత్సవ అనంతరం గ్రామంలోని ప్రతి కుటుంబంతో పాటు సమీపంలో ఉన్న కూనేపల్లి దూపల్లి, దండిగుట్ట, బాగేపల్లి గ్రామాల నుండి భక్తులు విచ్చేసి ఈ కళ్యాణంలో పాల్గొంటారు. అనంతరం వారికి అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు గాండ్ల నాగరాజ్, కిన్నెర మోహన్, గంగోని శంకర్, బాలయ్య, ప్రవీణ్, పోతన్న, గ్రామ పెద్దలు మైనిమోహన్, బోర్గం జలయ, వోడెక్క మోహన్, కాశం సాయిలు, గ్రామ యువతా తదితరులు పాల్గొన్నారు.